
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్టైల్‌తోనే కాకుండా తన హంబుల్ నేచర్‌తోనూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన ది హాలీవుడ్ రిపోర్టర్ – ఇండియా ఫస్ట్ ఎడిషన్ కవర్ స్టార్‌గా దర్శనమిచ్చారు. ఇది ఒక ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ కావడంతో, బన్నీకి గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ మరింత పెరిగింది.
అల్లు అర్జున్ సెల్ఫ్-మేడ్ స్టార్ అనిపించుకోవడమే కాదు, తనదైన ఓపీనియన్స్‌తోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. “ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి” అనే తత్వాన్ని నమ్మే బన్నీ, తనను తాను ఇప్పటికీ సామాన్యుడిగానే భావిస్తున్నట్లు చెప్పడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఖాళీ సమయాల్లో ఏం చేస్తారనడిగితే, “నథింగ్!” అంటూ సింపుల్‌గా చెప్పడం, ఆయన నేచురల్ మేనరిజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది.
ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్‌లో భారతీయ స్టార్ల గురించి రాయడం అరుదు. గతంలో ప్రభాస్, తారక్, రామ్ చరణ్ వంటి స్టార్స్ గురించి రాశారు, కానీ బన్నీ మాత్రం జక్కన్న (రాజమౌళి) ఇంపాక్ట్ లేకుండానే ఈ గౌరవాన్ని దక్కించుకోవడం ప్రత్యేకత.
ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ పాన్-ఇండియా సినిమా చేయనున్నారు. ఈ మూవీ మిథాలజీ బ్యాక్‌డ్రాప్ లో ఉండబోతోందని టాక్. ఇది త్రివిక్రమ్ కెరీర్‌లో తొలి పాన్-ఇండియా మూవీగా రానుండటం విశేషం.
బన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్న తీరు చూస్తుంటే, త్వరలోనే హాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు రావడం ఆశ్చర్యం కాదు.