- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు..
- ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆ నోటీసులు..
- అల్లు అర్జున్ను ఏసీపీ రమేష్ కుమార్ తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలు విచారణ..
- చిక్కడపట్టి పోలీస్టేషనల్ వద్ద భారీ బందోబస్తు..
Allu Arjun Question Hour: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు చిక్కడపల్లి పోలీసులు. గతవారం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్న ఈ రోజు పోలీసుల ఎదుట హాజరుకానున్నాడు.
Read also:AlluArjun : చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు.
అల్లు అర్జున్ను దర్యాప్తు అధికారి ఏసీపీ రమేష్ కుమార్ తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలు విచారించనున్నారు. ఈ కేసు నిమిత్తం కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ తన ఇంటి నుండి చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరాడు. ఈ కేసులో 11వ ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ నేడు పోలిసులు ముందు విచారణకు హాజరుకానుండగా బన్నీ స్టేట్ మెంట్ రికార్డింగ్ చేయనున్నారు పోలీసులు. బన్నీకి చిక్కడపల్లి పీఎస్ లో సంధ్య థియేటర్ ఘటన దృశ్యాలు చూపనున్న పోలీసులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ఏం చెబుతాడన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read also: AlluArjun : చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్..
అల్లు అర్జున్‌ని విచారించనున్న అంశాలు ఇవే..
1. సంధ్య థియేటర్ దగ్గర ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది?
2. సంథ్య థియేటర్‌కు రావద్దని మీకు ముందే యాజమాన్యం చెప్పిందా?
3. పోలీసులు అనుమతి లేదన్న విషయం తెలుసా? తెలియదా?
4. సంధ్య థియేటర్లో ప్రిమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా? ఆ కాపీ ఏమైనా ఉందా?
5. మీరు గానీ, మీ పీఆర్ టీమ్‌గానీ పోలీసుల అనుమతి తీసుకున్నారా?
6. సంధ్య థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితిని మీ పీఆర్ టీమ్ ముందే మీకు వివరించిందా?
7. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
8. తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు ముందుగా ఎరు చెప్పారు?
9. ఏసీపీ చెప్పనప్పుడు థియేటర్ నుంచి ఎందుకు వెళ్లలేదు?
10. రేవతి చనిపోయిన విషయం మరుసటిరోజు వరకు మీకు తెలియలేదా?
11. సినిమా ప్రారంభమయ్యాక కొద్దిసేపటికే తొక్కిసలాట విషయం తెలిసినా మీరెందుకు సినిమా చూశారు?
12. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందే థియేటర్ యాజమాన్యానికి చెప్పారా?
13. రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు?
Allu Arjun: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల ఆంక్షలు..