Pushpa -2 : బుక్ మై షో ‘కింగ్’ గా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్

  • రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తున్న పుష్ప 2
  • 2024 లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా
  • న్యూ ఇయర్ నుంచి సినిమాలో కొత్త సీన్లు

Pushpa 2 : ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, లెక్కల మాస్టారు సుకుమార్‌ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు.

Read Also:Fake IPS : ఫేక్‌ ఐపీఎస్‌ సూర్య ప్రకాశరావు కథ ఇలా..!

ఇక ఈ సినిమా విడుదలై మూడు వారాలు దాటినా.. ఎక్కడా కలెక్షన్స్ డ్రాప్ అవకుండా డీసెంట్ గా దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్ గా 22 రోజులకు గాను రూ. 1719.5 కోట్ల గ్రాస్ రాబట్టి తెలుగు సినిమా స్టామినా ఏమిటో మరోసారి తెలియజేసింది. ఈ కలెక్షన్స్ తో 2024 లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మొదటి స్థానాన్ని అందుకుంది పుష్ప -2. ఓవర్సీస్ లోను పుష్ప కు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక తెలుగు రాష్టాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన పుష్ప లాభాల బాటలో పయనిస్తోంది.

Read Also:Mad Square Movie: యువతను మత్తెక్కిస్తున్న ‘స్వాతి రెడ్డి’ ఫుల్‌ మాస్‌ సాంగ్‌..

ఈ సినిమాకు సంబంధించి హీరో అల్లు అర్జున్ న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఓ అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల 21 నిమిషాలుగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పటికే రన్ టైమ్ ఎక్కువయ్యింది. ఈ సినిమాలోని కొన్ని కీలక సీన్స్‌ను ఎడిటింగ్‌లో తీసేశారట మేకర్స్. ఇప్పుడు న్యూ ఇయర్ నుంచి ఈ సీన్స్‌ను సినిమాలో యాడ్ చేయనున్నారట. ముఖ్యంగా హీరో ఇంట్రొడక్షన్ సీన్ జపాన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సీన్ అర్ధాంతరంగా ముగించానట్లు అనిపిస్తుంది. దానికి సంబంధించిన కొన్ని సీన్స్‌ను ఇప్పుడు యాడ్ చేయబోతున్నారట. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సీన్స్‌కి సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ కొత్త సీన్లతో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *