Published on Dec 7, 2024 4:59 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎప్పుడు నుంచో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అని అందరికీ తెలిసిందే. మెయిన్ గా అయితే హిందీ ఆడియెన్స్ లో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ ఏ లెవెల్లో ఉందో ఇపుడు పుష్ప 2 చిత్ర రుచి చూపిస్తుంది.
ఇక ఈ చిత్రం ఆల్రెడీ ఇండియాలో హిందీ మార్కెట్ లో భారీ వసూళ్లతో హిందీ హీరోలు సైతం సెట్ చెయ్యని రికార్డులు నంబర్స్ పెడుతుంటే అల్లు అర్జున్ మార్కెట్ ఇక్కడ హిందీ ఆడియెన్స్ లోనే కాకుండా యూఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి హిందీ ఆడియెన్స్ లో కూడా యూనానిమస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి లేటెస్ట్ గా అయితే యూఎస్ లో ఒక్క హిందీ వెర్షన్ లోనే పుష్ప 2 చిత్రం 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటి ఫాస్టెస్ట్ 1 మిలియన్ డబ్బింగ్ హిందీ సినిమాగా కొత్త రికార్డు సెట్ చేసింది. ఇక దీనితో పాటుగా ఆస్ట్రేలియాలో హీరోకి లేని విధంగా పుష్ప 2 హిందీ వెర్షన్ లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయట. దీనితో హిందీ ఆడియెన్స్ లో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అనేది మనం అర్ధం చేసుకోవచ్చు.
Ruling the Box Office with Authority ????????#Pushpa2TheRule ( Hindi ) hits Fastest $1 Million+ Gross among recent dubbed films ❤️????❤️????#AlluArjun #Pushpa2 #AssaluThaggedhele pic.twitter.com/QQa2HTa0zI
— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 7, 2024