- నేటి ఉదయం చంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్..
- చంచల్గూడ జైల్లో అల్లు అర్జున్కు ఖైదీ నెంబర్ 7697 కేటాయింపు..
- జైలులోని మంజీర బ్యారక్లోని క్లాస్-1 రూంలో ఉన్న అల్లు అర్జున్..
Allu Arjun@7697: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్టైన హీరో అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం విడుదలపై తీవ్ర ఉత్కంఠత కొనసాగింది. అయితే, ఆయన ఇవాళ ఉదంయ 6.30 గంటలకు చంచల్‌గూడ జైలు వెనక గేటు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి కాసేపట్లో వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే, అభిమానులు ఎవరూ రాకుండా ఇరువైపులా బారికేడ్లు పెట్టారు.
Read Also: Allu Arjun Advocate: పోలీసులు కావాలనే అల్లు అర్జున్ బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారు..
అయితే, నిన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన తర్వాత గాంధీ ఆస్పత్రిలో హెల్త్ చెకప్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో న్యాయస్థానం పుష్పకు 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10.30 గంటల తర్వాత అందడంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలులోనే ఉంచాల్సి వచ్చింది. కానీ, బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు లేట్ గా అందడంతో శుక్రవారం రోజు రాత్రి మొత్తం ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది.
Read Also: IND vs AUS: గబ్బాలో భారత్ బౌలింగ్.. వర్షంతో ఆగిన ఆసీస్ బ్యాటింగ్
ఇక, అల్లు అర్జున్ రాత్రి 10.30 గంటల వరకు చంచల్ గూడ జైలులోని రిసెప్షన్ లోనే ఉన్నారు. కానీ, బెయిల్ పత్రాలు ఆలస్యం రావడంతో ఆయనను మంజీర బ్యారక్ లో ఉంచారు. ఈ సందర్భంగా జైలు అధికారులు అండర్ ట్రైల్ ఖైదీగా 7697 అనే నెంబర్ ను కేటాయించారు. బ్యారక్ లోని క్లాస్ -1 రూమ్ లో అల్లు అర్జున్ తో పాటు మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నట్లు సమాచారం. నేటి ఉదయం అల్లు అర్జున్ తరపు లాయర్ రూ. 50 వేల పూచీకత్తును జైలు సూపరిండెంట్ కు సమర్పించిన తర్వాత విడుదల చేశారు.