- నేడు చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్
- మధ్యాహ్నం వెళ్లనున్నట్లు సమాచారం
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. బెయిల్ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదయ్యాడు.. మొదట గీతాఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కాసేపు గడిపిన తర్వాత తన నివాసానికి చేరుకున్నారు.. కుటుంబ సభ్యులు బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన అన్నారు.. బాధిత రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పారు.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అర్జున్‌ను వరుసగా సినీ ప్రముఖులు వచ్చిన పరామర్శించారు.. అయితే..
READ MORE: Save The Girl Child: సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలి: హోంమంత్రి అనిత
ఈ రోజు మధ్యాహ్నం ప్రముఖ నటుడు చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ తొలిసారి చిరంజీవి ఇంటికి వెళ్లారు. కుటుంబంతో సహా అక్కడికి చేరుకున్నారు. ఇటీవల పరిణామాలపై వారిద్దరు చర్చించనున్నారు. తన పై జరిగిన కేసుపై చర్చించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే లంచ్ చేయనున్నారు.
READ MORE: Taapsee Pannu: పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన తాప్సీ..