- నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు..
- కేసు కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడు ఏం మాట్లాడలేను..
- నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు..
- వతి కుటుంబానికి నా సానుభూతి.. ఆ ఘటన దురదృష్టకరం..
- ఇది అనుకోకుండా జరిగిన ఘటన.. ఆ కుటుంబానికి అండగా ఉంటా..
Allu Arjun Press Meet: సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.. జైలు నుంచి మొదట గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. కొంతసేపు అక్కడ గడిపారు.. పలువురు దర్శకులు, నిర్మాతలు.. సన్నిహితులు, కుటుంబ సభ్యులు.. బన్నీని పరామర్శించారు.. ఇక గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయల్దేరి తన నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్.. బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు భార్య స్నేహారెడ్డి.. పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడతూ బన్నీ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు.. వాళ్ల అమ్మ పిల్లల్ని ఆలింగనం చేసుకున్నాడు.. అభిమానులకు అభివాదం చేశారు.. గుమ్మడికాయతో దిష్టి తీస్తూ ఇంట్లోకి ఆహ్వానించారు కుటుంబ సభ్యులు..
Read Also: Allu Arjun Advocate: పోలీసులు కావాలనే అల్లు అర్జున్ బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారు..
ఇక, తన అరెస్ట్‌పై స్పందించారు అల్లు అర్జున్.. ఇంటికి చేరుకోగానే మొదట కుటుంబ సభ్యులను కలిసిన ఆయన.. ఆ తర్వాత.. గేట్ వరకు వచ్చి మీడియాతో మాట్లాడారు.. నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.. అయితే, కేసు కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడు ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపిన బన్నీ.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. రేవతి కుటుంబానికి నా సానుభూతి.. జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు మద్దతు తెలిపిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు చెప్పారు పుష్పరాజ్..