‘కంగువా’ హీరోతో మెగా హీరో ఇంటర్వ్యూ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 26, 2024 1:43 AM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువా’ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కిస్తుండగా, సూర్య ఇందులో వెరైటీ గెటప్‌లో కనిపిస్తూ సూర్య ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో తెలుగులోనూ ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దీని కోసం వారు తెలుగులో ప్రమోషన్స్ కూడా భారీగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మెగా హీరో అల్లు శిరీష్‌తో కలిసి హీరో సూర్య ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఇంటర్వ్యూలో శిరీష్ సూర్యని ఎలాంటి ప్రశ్నలు అడిగాడు.. వాటికి సూర్య ఎలాంటి సమాధానాలు చెప్పాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *