Allu Sneha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న భార్య అల్లు స్నేహకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్ స్టాలో 9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ తో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గానే ఆమె తన బర్త్ డేను గ్రాండ్ గా భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. సెప్టెంబర్ 29న స్నేహ బర్త్ డే సందర్భంగా బన్నీ, స్నేహ కలిసి ఆమ్ స్టర్ డామ్ కు వెళ్లారు.
Learn Additionally : Kiran Abbavaram : ఆ హీరోను అవమానించడం కరెక్ట్ కాదు : కిరణ్ అబ్బవరం
అక్కడ ఏకాంతంగా గడుపుతూ ఎంజాయ్ చేశారు. వీరిద్దరూ రోడ్లపై తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా స్నేహ తమ టూర్ కు సంబంధించిన పిక్స్ ను పంచుకుంది. ఇందులో తన బర్త్ డే రోజు కేవలం తామిద్దరమే ఉన్నట్టు అందులో తెలిపింది. ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఆమెకు బిలేటెడ్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. బన్నీ ప్రస్తుతం అట్లీతో చేస్తున్న సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Learn Additionally : Srikanth Bharat : క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్