పిల్లలతో కలిసి వర్కౌట్స్ చేస్తున్న అల్లు స్నేహ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Nov 14, 2024 1:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి కూడా అంతకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. సమయం దొరికినప్పుడల్లా తన భార్య, పిల్లలతో సమయం గడుపుతుంటాడు. అటు ఆయన భార్య అల్లు స్నేహ కూడా పిల్లలతో సమయం గడిపేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది.

తమ పిల్లలకు అన్ని విషయాల్లోనూ మంచి, చెడుల గురించి వివరించడమే కాకుండా.. వాటిని పాటించేలా ఆమె చూస్తున్నారు. తమ ఆరోగ్యంపై వారికి చిన్నతనం నుండే అవగాహన వచ్చేలా ఆమె చూస్తున్నారు. తాజాగా ఆమె రోజూ చేసే వర్కౌట్స్‌ను తన పిల్లలు అల్లు అయాన్, అల్లు ఆర్హలతో కూడా చేయించారు. దీనికి సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను కూడా ఆమె షేర్ చేశారు.

ఇలా పిల్లలకు చిన్నతనం నుండే ఆరోగ్యం పట్ల అవగాహన తీసుకురావడం చాలా మంచిదని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *