అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 రిలీజ్ నేపథ్యంలో పుష్ప ప్రీమియర్ చూసేందుకు చిత్ర హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లడంతో అల్లు అర్జున్ ను చూసేందుకు సంధ్య థియేటర్ కు అభిమానులు భారీగా తరలివచ్చిన క్రమంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) మృతి చెందగా ఆమె కుమారడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also Read : Manchu Case : మంచు మనోజ్ కేసులో ఒకరు అరెస్ట్.!
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కేసు నమోదు చేసిన చిక్కడ్‌పల్లి పోలీసులు అందుకు కారకులైన చిత్ర హీరో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంఫై కేసులు నమోదు చేసారు. కాగా అల్లు అర్జున్ పై నమోదయిన కేసులో హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్. పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్ దాఖలు చేసాడు. తనపై నమోదైన కేసులో కొట్టేయాలని పిటీషన్‌లో కోరిన అల్లు అర్జున్. ఆ రోజు జరిగిన అవాంఛనీయ ఘటనపట్ల అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం స్పందిస్తూ వారి కుటుంబానికి తమను అండగా ఉంటాను అని కూడా హామీ ఇచ్చాడు. అల్లుఅర్జున్ కేసులో ఏ విధమైన తీర్పు వస్తుందోనని అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్కంట నెలకొంది.