Amritha Aiyer Latest Movie Updates
Amritha Aiyer Latest Movie Updates

అందాల తార అమృత అయ్యర్ 1994, మే 14న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. కానీ, ఆమె కర్ణాటక బెంగళూరులో పెరిగారు. St. Joseph’s College of Commerce లో Bachelor of Commerce (B.Com) పూర్తి చేసిన తరువాత మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని, అక్కడి నుంచి సినీరంగంలోకి ప్రవేశించారు.

అమృత కెరీర్ తొలినాళ్లలో Lingaa (2014), Theri (2016), Pokkiri Raja (2016) వంటి తమిళ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. 2018లో Vijay Yesudas సరసన ‘Padaiveeran’ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసి Malar పాత్రలో మెప్పించారు. Vijay Antony సరసన Kaali (2018) లోనూ నటించారు. Bigil (2019) లో Thalapathy Vijay సరసన Tamil Nadu football captain Thendral పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందారు.

2021లో Ram Pothineni తో RED సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అదే ఏడాది Pradeep Machiraju తో 30 Rojullo Preminchadam Ela, Vishnu తో Arjuna Phalguna చిత్రాల్లో నటించారు. 2024లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన Hanuman సినిమాలో Teja Sajja సరసన హీరోయిన్‌గా నటించి, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా 2024 Sankranti Winner గా నిలిచి, అమృత కెరీర్‌కు కొత్త ఊపునిచ్చింది.

ఇటీవల Allari Naresh తో Bachhalamalli సినిమాలో నటించి మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. ఈవిధంగా అమృత అయ్యర్ Tamil, Telugu, Kannada భాషల్లో నటిస్తూ, తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *