- బాలయ్య బాబీ కాంబోలో డాకు మహారాజ్
- హై యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా
- ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్
Daaku Maharaj : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అయన తన తాజా చిత్రం డాకు మహారాజ్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Also:Donald Trump: పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం.. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తా!
సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కోసం గ్రాండ్ ప్లానింగ్స్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్లానింగ్స్ లో జనవరి మొదటి వారంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్ ప్రైజ్ గెస్ట్ ను తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. మరి దీని ప్రకారం ఆ అతిధి ఎవరో కాదు మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.
Read Also:Jr. NTR : వార్ – 2 షూటింగ్ ముగిసింది.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
తారక్ తో ఈ సినిమా నిర్మాతలు నాగవంశీ, త్రివిక్రమ్ లకి మంచి అనుబంధం ఉంది. పైగా ఇది బాలయ్య సినిమా కూడా దీనితో ఉన్న హైప్ ని మరింత బూస్టప్ ఇచ్చేలా ఈ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి దీనిపై ఏమన్నా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.