సాధారణంగా సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాతే ఓటీటీ (OTT)లో వస్తాయి. కానీ తాజాగా అక్కినేని సుమంత్ హీరోగా నటించిన అనగనగా సినిమా మాత్రం ఇది రివర్స్ ట్రెండ్ చూపుతోంది. ఈ చిత్రం మొదట ఓటీటీలోనే విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు థియేటర్లలో విడుదల కావడం సినిమా విశేషమైంది. పిల్లల చదువు, పెంపకం, తల్లి దండ్రుల బాధ్యతలను హృదయానికి తాకేలా ఈ సినిమా చూపించింది. సన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌లో సుమంత్ ‘వ్యాస్’ పాత్రలో మెప్పించాడు. అలాగే అతని భార్య, స్కూల్ ప్రిన్సిపాల్ పాత్రలో కాజల్ చౌదరి కూడా అందం, నటనతో అందరిని ఆకట్టుకుంది.
కాజల్ చౌదరి బీహార్‌లోని పాటలీపత్ర పట్టణానికి చెందిన యువత. కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదివింది. చదువుల మధ్య మోడలింగ్ మొదలుపెట్టిన ఆమె పలు అందాల పోటీలలో పాల్గొని, 2024లో మిస్ యూనివర్స్ బీహార్‌గా ఎంపికైంది. పిల్లల పెంపకం, కుటుంబ విలువలపై దృష్టి పెట్టే ‘అనగనగా’ సినిమా ఆమెకు తెలుగు ఇండస్ట్రీ పరిచయం అయింది.
కాజల్ మొదట ఒక తమిళ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇప్పుడు సుమంత్‌తో కలిసి నటించిన ‘అనగనగా’ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమా విజయంతో ఆమెకు మరిన్ని అవకాశాలు కూడా దక్కాయి. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న కరాలి సినిమాలో కథానాయికగా ఎంపిక అయింది. మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు కూడా ఆమెకు ఉన్నాయి. అందాలతో పాటు అద్భుతమైన నటన వల్ల ఈ కొత్త తార త్వరలో మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నారు.