Anandhi’s Shivangi Movie First Look
Anandhi’s Shivangi Movie First Look

ఈ రోజుల్లో, బస్ స్టాప్, జాంబి రెడ్డి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆనంది తన నూతన మాస్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు క్లాస్, క్యూట్ క్యారెక్టర్లతో కనిపించిన ఆనంది, ఈసారి పూర్తిగా మాస్ అవతారంలో సందడి చేయనుంది.

తాజాగా ఆమె శివంగి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇందులో నల్ల లుంగీ, స్టైల్ కళ్లజోడు, డైనమిక్ లుక్‌తో ఆమె స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూసిన అభిమానులు తొలుత ఆమెను గుర్తుపట్టలేక షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శివంగి మూవీ దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. లేడీ ఓరియంటెడ్ స్టోరీ గా రూపొందిన ఈ చిత్రంలో ఆనందితో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం మార్చి 7, 2025 న విడుదల కానుంది.

ఆనంది వరంగల్ లో జన్మించి తెలుగు సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రస్తుతం తమిళ్ పరిశ్రమలో బిజీగా ఉంది. ఆమె చివరిసారిగా నాగ చైతన్య కస్టడీ సినిమాలో నటించింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *