Mon. Oct 13th, 2025
Ananthika : సందీప్ వంగా మూవీలో ఛాన్స్ కొట్టేసిన..8 వసంతాలు ఫేమ్ అనంతిక!

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ సినిమా ‘స్పిరిట్’ కోసం ఆయన రెడీ అవుతున్నప్పటికీ, సమాంతరంగా నిర్మాతగా కూడా ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగా సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ఓ చిన్న సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో కొత్త దర్శకుడు వేణు తెరపైకి రానున్నారు. కథా పరంగా ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో నడిచే పల్లెటూరి ప్రేమకథగా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ను ఎంపిక చేసినట్లు తెలిసింది.‘మ్యాడ్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ‘ 8 వసంతాలు’లో సహజమైన నటనతో ఆకట్టుకున్న అనంతికకు ఇది మంచి అవకాశం అని సినీ వర్గాలు అంటున్నాయి. హీరోగా ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ కనిపించబోతున్నాడు. కొత్త జంటగా ప్రేక్షకులకు కొత్త ఫ్రెష్‌నెస్ ఇవ్వనుంది.