
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడంతో ఆమె కెరీర్ సెట్ అయ్యిందని అందరూ భావించారు. కానీ ఆ తరువాత పొట్టేల్, తంత్ర, శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్, డార్లింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.
ఇందువల్ల అనన్య స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కుతుందని ఆశపడింది కానీ, అలాంటి అవకాశాలు రాలేదు. ప్రస్తుతం చిన్న సినిమాల్లో నటిస్తూ, తన అందం, నటనతో అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు, అనన్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి, గ్లామర్ ఫోటోషూట్‌లతో హల్‌చల్ చేస్తోంది.
రీసెంట్‌గా అనన్య వైట్-బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్సులో స్టైలిష్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో అనన్య చాలా క్యూట్‌గా, మోడ్రన్ లుక్‌లో కనిపించింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు “క్యూట్”, “బ్యూటిఫుల్” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవుతూ, అనన్య హాట్ టాపిక్‌గా మారింది.
ఇకపోతే, అనన్య తాజాగా కొన్ని కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. త్వరలో అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. అనన్య కెరీర్ మళ్లీ బూస్ట్ అవుతుందా? లేక చిన్న సినిమాలతోనే కొనసాగుతుందా? వేచిచూడాల్సిన అవసరం ఉంది.