
టాలీవుడ్ లో ప్రముఖ యాంకర్ లాస్య, తన ఆధ్యాత్మిక యాత్ర తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల మహా కుంభమేళా లో పాల్గొని పవిత్ర స్నానం చేసిన ఆమె, ఆ తర్వాత వారణాసి, కాశీ, అయోధ్య, అరుణాచలం లాంటి పవిత్ర క్షేత్రాలను దర్శించుకుంది.
తాజాగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది. ప్రత్యేకంగా తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త మంజునాథ్ తో కలిసి కాలినడకన తిరుమల కొండ ఎక్కి, శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం సోషల్ మీడియా లో తన ఫోటోలను షేర్ చేస్తూ,
“మా పెళ్లి రోజు తిరుమల కొండను కాలినడకన ఎక్కాము… గోవిందా గోవిందా… ఓం నమఃశివాయ!” అంటూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది.
లాస్య, మంజునాథ్ ప్రేమ వివాహం 2017లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం లాస్య టీవీ షోలు, యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది.
తన ఆధ్యాత్మిక యాత్ర ని పంచుకుంటూ, లాస్య ఆధ్యాత్మిక వైభవాన్ని ఆస్వాదిస్తూ ఉంటోంది. ఆమె ట్రిప్ కి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు అభిమానులు ఆమె తదుపరి యాత్ర ఎక్కడ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.