Mon. Oct 13th, 2025
Andhra King Taluka Teaser : ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రిలీజ్.. బొమ్మ బ్లాక్ బస్టర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం  ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.  భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నారు. వివేక్ & మెర్విన్ సంగీతం అందించారు మరియు ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. నిర్మాణం చివరి దశలో ఉన్న ఈ సినిమా నుండి మేకర్స్ ఈరోజు టీజర్‌ను  రిలీజ్ చేసారు.

రామ్ పోతినేని సినిమా అభిమాని పాత్రలో  ప్రతి హీరో అభిమాని ఈ పాత్రలో తమను తాము చూసుకుంటారు. రామ్ పర్ఫామెన్స్ సూపర్బ్ గా ఉంది. భాగ్యశ్రీ బోర్సే అందం అభినయం కలగలిపి చక్కగా ఉంది. ఇక రావు రమేష్ మరియు తులసి రామ్ తల్లిదండ్రులుగా కనిపించగా , సత్య అతని స్నేహితుడిగా, మురళీ శర్మ థియేటర్ ఓనర్ గా కనిపించారు. తొలి చిత్రంతోనే పెద్ద విజయాన్ని అందించిన దర్శకుడు మహేష్ బాబు పి, మరోక మంచి కథతో రాబోతున్నాడు. వివేక్-మెర్విన్ నేపథ్య సంగీతం టీజర్  కథనాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు నాణ్యతతో ఉన్నాయి. టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు. ఆంధ్ర కింగ్ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.