Tollywood : భారత దేశ చలన చిత్ర పరిశ్రమ లో ఆంధ్రప్రదేశ్ నం- 1

సినిమాలకు భారతీయులకు విడదీయరాని బంధం ఉంది. మూకీ సినిమాలతో మొదలైన మన సినిమాల పర్వం నేడుదేశాలు, ఖండాలు దాటి ఎక్కడెక్కడికో విస్తరించింది. అయితే ఇండియా మొత్తం లో సినిమాను అమితంగా ఇష్టపడేది ఎవరు అంటే అందరి నోటా వినిపించే మాట ఒకటే తెలుగు రాష్ట్రాల ప్రజలు అని. కథ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలను మన ప్రేక్షకుల ఎప్పడు ఆదరిస్తూ వచ్చారు.

ఇక థియేటర్ లో సినిమా చూడడం అనేది మనకి ఒక ఎమోషన్. తమ అభిమాన హీరోల సినిమా రిలీజ్ అయితే థియేటర్ వద్ద అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఈ మధ్య జరిగిన ఓ సర్వ్ ప్రకారం తెలుగు ప్రజలకు సినిమా పట్ల అభిమానం ఏ పాటిదో మరోసారి నిరూపించింది. భారతదేశంలో ఉన్న సినిమా థియేటర్లలో ఏపీ అగ్రస్థానం సాధించింది. సినిమాలను ఏపీ ప్రజలు ఎంతగా ఆధరిస్తారో చెప్పేందుకు రాష్ట్రంలోని థియేటర్లే నిదర్శనం అని మరోసారి రుజువైంది. భారతదేశంలో మొత్తం 6877 థియేటర్లు ఉంటె అందులో ఒక్క ఏపీలోనే 1097 థియేటర్లు ఉన్నాయి. మన పక్క రాష్ట్రం తమిళనాడులో 942, కర్ణాటకలో 719, మహారాష్ట్రలో 703లో తెలంగాణలో 485, గుజరాత్  లో 420, బెంగాల్ 373, ఉత్తరప్రదేశ్ లో 321, బీహార్ లో 315, మధ్యప్రదేశ్ లో 188, రాజస్థాన్ లో  178, ఒడిశాలో 141, మిగతా రాష్ట్రాల్లో దాదాపు 100 లోపు థియేటర్లు ఉన్నాయట. టాప్ 5 లో నాలుగు  స్థానాలు దక్షిణాది రాష్ట్రాలు ఉండడం సినిమా పట్ల సౌత్ ప్రేక్షకుల అనుబంధం ఏంటో తెలుస్తోంది

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *