టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ సెన్సేషన్ తమన్ ముందు వరసలో ఉంటాడు. స్టార్ హీరోల సినిమాలు అన్నిటికి ఈ కుర్రాడే సంగీతం అందిస్తున్నాడు. క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నాడు తమన్. అయితే తమన్ మరియు నందమూరి నటసింహ బాలకృష్ణ కాంబో అంటే ఫ్యాన్స్ కు స్పెషల్ క్రేజ్. వీరి కాంబోలో వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడమే కాదు మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసాయి.
ఇక వీరి కాంబో వస్తున్న లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తమన్ బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కు అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ‘ బక్కోడికి రజనీకాంత్ ఉంటె.. బండోడికి బాలయ్య ఉన్నాడు’ అని అన్నాడు. ఈ కామెంట్స్ నిజమేనని సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. అందరి హీరోల సినిమాలకు ఒక రకమైన మ్యూజిక్ ఇచ్చే తమన్ బాలయ్య సినిమా అంటే చాలు పూనకం వచ్చినట్టు ఉగిపోతాడు. బాలయ్య స్క్రీన్ మీద కనపడిన ప్రతి షాట్ ను తన నేపధ్య సంగీతంతో మరో లెవల్ కు తీసుకువెళతాడు తమన్. వీరి కాంబోలో వచ్చినఅఖండ సినిమాకు స్పీకర్లు పగిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే రజనీకాంత్ కంటే అనిరుధ్ కూడా రెచ్చిపోయి మ్యూజిక్ ఇస్తాడు. జైలర్, వెట్టయాన్, దర్బార్, పేట సినిమాలు ప్రూఫ్ చేసాయి. ఈ ఇద్దరి సీనియర్ హీరోలకు ఈ ఇద్దరు యంగ్ స్టర్స్ తమ మ్యూజిక్ తో సినిమాను మరో లెవల్ కు తీసుకువెళుతున్నారు అనేది మాత్రం వాస్తవం.