Game Changer : గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి రోల్.. ఇప్పటి దాకా ప్రచారం అంతా ఉత్తిదే

  • భారీ బడ్జెట్ తో తెరకెక్కు శంకర్ గేమ్ ఛేంజర్
  • ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్
  • గేమ్ ఛేంజింగ్ రోల్ చేస్తున్న అంజలి

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ నడుస్తున్నాయి. ఈ నెల ఆఖరున మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఇండియన్ 2 ఫ్లాప్ తర్వాత శంకర్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు. కచ్చితంగా రామ్ చరణ్ కెరియర్ లోనే ఈ చిత్రం బెస్ట్ మూవీ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. తండ్రి కొడుకులుగా రెండు పాత్రలు చేస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ కి జోడీగా కియారా అద్వానీ కనిపించబోతోంది. అలాగే తండ్రి పాత్రకి జోడీగా అంజలి నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రని ఇప్పటి వరకు శంకర్ రివీల్ చేయలేదు.

Read Also:Bhatti Vikramarka: నేడు బట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌ కమిటీ సమావేశం..

సాంగ్స్ అన్ని కూడా ఆల్ మోస్ట్ కియారా అద్వానీతోనే ఉన్నట్లు చూపించారు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అంజలి, రామ్ చరణ్ పై ఒక సాంగ్ ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో అంజలి క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ శంకర్ తెలిపారు. అందుకే ఆమె పాత్రని పూర్తిగా రివీల్ చేయకుండా సర్ప్రైజింగ్ గా ఉంచినట్లు కొందరు చెబుతున్నారు. సినిమాలో స్టోరీని మలుపు తిప్పే క్యారెక్టర్ లో అంజలి కనిపిస్తుందట. చాలా కాలం తర్వాత అంజలి తెలుగులో చేస్తోన్న పెద్ద సినిమా ఇదే.. సినిమాలలో ఆమె పాత్రలో ఏదో ప్రత్యేకత ఉంటేనే తప్ప అంజలి సాధారణంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. శంకర్ కూడా తన సినిమాలలో హీరోయిన్ల పాత్రలను బలంగా చూపిస్తాడు.

Read Also:Sankranti Special Buses: గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్కు ప్రత్యేక బస్సులు

ఏదో గ్లామర్ పరంగా వచ్చిపోయే తరహాలో హీరోయిన్లను శంకర్ ఎప్పుడు చూపించరు. అలాగే ‘గేమ్ చేంజర్’ లో కూడా అంజలి పాత్రని చాలా బలంగా డిజైన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మూవీ కథలో అసలైన గేమ్ చేంజర్ గా ఆమె ఉండబోతోందట. అలాగే అంజలికి యూత్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే గేమ్ ఛేంజర్ లో ఆమె పాత్రపై కూడా అభిమానులు అంచనాలతో ఉంటారు. సినిమా ఏమాత్రం క్లిక్కయినా కూడా ఆమె కెరీర్ కు మరింత బూస్ట్ లభించినట్లే. ఇక గేమ్ ఛేంజర్ పాత్ర ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *