Published on Dec 31, 2024 9:00 AM IST
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలు మార్చడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు శంకర్ తనదైన మార్క్‌తో తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది.
అయితే, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఎవరెవరు ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నారా.. అనే ఆసక్తి నెలకొంది. కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఐఏఎస్ పాత్రలో రామ్ చరణ్ స్టన్ చేయనుండగా.. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్రలోనూ చరణ్ ఇరగదీయనున్నాడట. అయితే, ‘గేమ్ ఛేంజర్’ మూవీ కథను ఛేంజ్ చేసేది మాత్రం నటి అంజలి పాత్ర అని ఇన్‌సైడ్ వర్గాల టాక్.
ఆమె పాత్రను దర్శకుడు శంకర్ డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుందని.. ఆమె పాత్ర ఈ సినిమాకు ఎలాంటి మలుపును తీసుకొస్తుందనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని చిత్ర వర్గాల నుంచి వస్తున్న టాక్. మరి నిజంగానే అంజలి పాత్ర ఈ సినిమాకే గేమ్ ఛేంజర్ రోల్ కానుందా.. అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.