RC16 కోసం ఫస్ట్ షూట్ చేసేది అదేనా..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 8, 2024 10:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా మైసూర్ నగరంలో స్టార్ట్ అయింది. ప్రస్తుత షెడ్యూల్ ను హైదరాబాద్‌ లోని భూత్ బంగ్లాలో ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరో కూడా కనిపించబోతున్నాడని.. ఆ హీరోది చాలా కీలకమైన పాత్ర అని టాక్ నడుస్తోంది. నిజానికి ఓ బాలీవుడ్ స్టార్ ను ఈ సినిమాలో తీసుకోబోతునట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

బహుశా ఈ పాత్ర కోసమే బాలీవుడ్ హీరోని అప్రోచ్ అవుతున్నారేమో చూడాలి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారట. కాగా ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్‌ నటించబోతుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *