
తెలుగు సినీప్రేక్షకులను మెప్పించిన MAD సినిమా ద్వారా పాపులర్ అయిన క్యారెక్టర్ యాంథోని. మొదట చిన్న సినిమాగా వచ్చినా, ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అవడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో యాంథోని పాత్రలో కనిపించిన నటుడు రవి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. “దేంతోని..” అనే డైలాగ్ నెట్టింట్లో ట్రెండ్ అయింది, reels మరియు memesలో చాలానే షేర్ అవుతోంది.
యాంథోని పాత్రలో కనిపించిన Actor Ravi మల్టీటాలెంటెడ్ వ్యక్తి. ఆయన కెరీర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రారంభమైంది. ఆర్ట్ డైరెక్టర్‌గా పలు సినిమాల్లో పని చేసిన తర్వాత ఆయనకు Actor Siddhu Jonnalagadda పరిచయం అయ్యాడు. రవిలో ఉన్న రైటింగ్ టాలెంట్‌ను గుర్తించి, DJ Tillu, Tillu Square సినిమాలకు రైటర్‌గా అవకాశం ఇచ్చాడు. ఇప్పటి వరకు రవి ఏడు సినిమాల్లో నటుడు, ఆర్ట్ డైరెక్టర్, రైటర్‌గా పని చేశారు.
MAD సినిమాకి డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఒక కామెడీ క్యారెక్టర్ కోసం వెతుకుతుండగా, తన స్నేహితుడైన రవిని యాంథోని పాత్రకు ఎంపిక చేశారు. అది ఆ సినిమా హైలైట్ క్యారెక్టర్‌గా నిలిచింది. అందుకే MAD Square సినిమాలో కూడా అదే పాత్రను కొనసాగించారు. ఎన్టీఆర్ స్వయంగా MAD Square ఈవెంట్ లో పాల్గొని యాంథోని పాత్రను పొగడటం విశేషం.
ప్రస్తుతం రవి నటుడిగా కొత్త అవకాశాలను అందుకుంటున్నారు. Vishwak Sen – Anudeep KV కాంబినేషన్‌లో రూపొందుతున్న ఒక ఫంకీ సినిమా లోనూ నటిస్తున్నారు. కామెడీ, రైటింగ్, ఆర్ట్ డైరెక్షన్ అన్నింటిలోను నైపుణ్యం ఉన్న రవి, ఇండస్ట్రీలో తాను ముందుకు వెళ్లే మార్గాన్ని ఖచ్చితంగా ఏర్పరచుకుంటున్నారు.