
యాంటీక్రైస్ట్.. 2009లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైన హారర్ సినిమా. లార్స్ వాన్ ట్రయర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 18 దేశాలు నిషేధించాయి. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, చిత్రంలోని గ్రాఫిక్ కంటెంట్, మానసిక ఆరోగ్యంపై ప్రభావం వల్ల వివాదానికి గురైంది.
ఈ సినిమాలో హాలీవుడ్ నటులు విలియం డఫో, షార్లెట్ గెయిన్స్‌బర్గ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక దంపతులు తమ కుమారుడి మరణం నుంచి కోలుకోవడానికి అరణ్యానికి వెళతారు. కానీ, అక్కడ పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. భర్తపై భార్య ప్రవర్తన మారిపోవడం, ఆత్మహత్యా భావనలు కలగడం కథలో ప్రధానాంశం.
సినిమా బడ్జెట్ $11 మిలియన్ (రూ. 95.61 కోట్లు) కాగా, ప్రపంచవ్యాప్తంగా $21.7 మిలియన్ (రూ. 188.38 కోట్లు) వసూలు చేసింది. తొలుత భారత్‌లోనూ నిషేధించబడిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీలోకి రాబోతోందని సమాచారం.
యాంటీక్రైస్ట్ సినిమా కథాంశం తీవ్రమైన మానసిక ప్రభావాన్ని కలిగించవచ్చు. హారర్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఓ విభిన్న అనుభూతిని అందించగలదు.