Mon. Oct 13th, 2025
Anushka : ఒకే భాగంగా వస్తున్న ‘బాహుబలి ది ఎపిక్’.. అనుష్క ఎమోషనల్ టాక్

టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎన్నో భారీ హిట్ చిత్రాలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చిత్రం ‘బాహుబలి’ అనే చెప్పాలి. ‘బాహుబలి’కి ముందు, తర్వాత అనేలా ఈ చిత్రం ఓ క్లాసిక్‌గా చరిత్రలో నిలిచిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచాయి. ఇందులో దేవసేనగా నటించిన అనుష్క జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అమరేంద్ర బాహుబలికి భార్యగా, మహేంద్ర బాహుబలికి తల్లిగా రెండు వేరియేషన్స్‌లో నటించి తనకంటూ సెపరెట్ ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఈ రెండు సినిమాలు ‘బాహుబలి ది ఎపిక్‌’ పేరుతో ఒకే భాగంగా అక్టోబరు 31న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘బాహుబలి’ఫై స్పందించిన అనుష్క రిలీజ్ టైమ్‌లో తాను సరిగ్గా ఆస్వాదించలేకపోయానని చెప్పుకొచ్చింది.

Additionally Learn : Kantara Bankruptcy 1: ‘కాంతార-1’ నుంచి మరో పాట.. రిలీజ్‌..

అనుష్క మాట్లాడుతూ, “బాహుబలి సినిమాలు విడుదలైనప్పుడు ప్రమోషన్స్‌ని, ఇతర బిజీ షెడ్యూల్‌ల కారణంగా వాటిని పూర్తిగా ఆస్వాదించలేకపోయాము. ఇప్పుడు రెండు సినిమాలు ఒకే భాగంగా మళ్లీ థియేటర్లలో రావడం నాకు చాలా హ్యాపీగా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈసారి ఈ అనుభూతిని ఆస్వాదించాలనుకుంటున్నా” అని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం నిర్మాత శోభు ‘బాహుబలి ది ఎపిక్’ గురించి చెప్పనప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించిందని చెప్పారు అనుష్క. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కోసం తెర వెనుక భారీ వర్క్ జరుగుతోందని, ప్రేక్షకులకు ఒక కొత్త సినిమా చూసిన అనుభూతిని మళ్లీ అందించనున్నట్లు ఆమె తెలిపారు.