దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ సినిమాకి లీగల్ నోటీసు ఇచ్చింది ఏపీ ఫైబర్ నెట్. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారని నోటీసులు ఇచ్చారు. ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా పలువురికి నోటీసులు చేశారు చేశారు. ఒక వ్యక్తి చూస్తే వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలి.. రూ.11 వేలు చొప్పున ఇవ్వడంపై ఆర్జీవీకి ఫైబర్‌నెట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘వ్యూహం’ సినిమా టీంతో ఫైబర్ నెట్ అగ్రిమెంట్ చేసుకొని రూ.2.15 కోట్లకి గాను 1.15 కోట్లు చెల్లించిందని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు.
Donald Trump: “అమెరికా నుంచి చమురు కొనాలి, లేదంటే..” యూరప్‌కి ట్రంప్ వార్నింగ్..
వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని వివరించారు. ఫైబర్ నెట్ లో కేవలం వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయని …. ఈ లెక్కన ఒక్కో వ్యూస్ కు రూ.11 వేలు చొప్పున చెల్లించినట్లు అయ్యిందని వివరించారు. ఒక వ్యక్తి చూస్తే వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలి.. రూ.11 వేలు చొప్పున ఇవ్వడంపై వివరణ కోరుతూ లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది అని చైర్మన్ జీవి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.