గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ మరో వారంలో థియేటర్లలో సందడి చేయనుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ ప్రెస్టీజియస్ పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీతో రామ్ చరణ్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ చేశాయి.
అయితే, ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన బెనిఫిట్ షో జనవరి 10న అర్ధరాత్రి 1 గంటకు ప్రదర్శించేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇక ఈ బెనిఫిట్ షో టికెట్ రేటు రూ.600 గా ఫిక్స్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని అందరికంటే ముందే చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
రామ్ చరణ్ డ్యుయెల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.
The post ‘గేమ్ ఛేంజర్’ బెనిఫిట్ షో ఫిక్స్.. టికెట్ రేటు ఎంతంటే? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.