ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏప్రిల్ నెల విషయానికి వస్తే
ఏప్రిల్ 1: అనువాద చిత్రాల రచయిత, దర్శకుడు శ్రీ రామకృష్ణ (74) చెన్నైలో కన్నుమూత
ఏప్రిల్ 1: ప్రముఖ చిత్రకారుడు, ‘దాసి’ చిత్రానికి కాస్ట్యూమర్ గా జాతీయ అవార్డును అందుకున్న పిట్టంపల్లి సుదర్శన్ (72) అనారోగ్యంతో
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కన్నుమూత
ఏప్రిల్ 1: ప్రముఖ హాస్య నటుడు గరిమెళ్ళ విశ్వేశ్వరరావు (64) అనారోగ్యంతో కన్నుమూత
ఏప్రిల్ 3: సీనియర్ సినిమాటోగ్రాఫర్ పోతిన వెంకట రమణ అనారోగ్యంతో కన్నుమూత
ఏప్రిల్ 13: చెన్నయ్ లోని వేల్స్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ను అందుకున్న రామ్ చరణ్
ఏప్రిల్ 13: ఆడపిల్లకు తండ్రయిన నటుడు మంచు మనోజ్
ఏప్రిల్ 14: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ దాడి
ఏప్రిల్ 15: తరుణ్ కార్తికేయతో ప్రముఖ దర్శకుడు ఎస్. శంకర్ కుమార్తె, గాయని ఐశ్వర్య వివాహం
ఏప్రిల్ 16: ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ద్వారకేశ్ (81) వయో సహజ అనారోగ్యంతో కన్నుమూత
ఏప్రిల్ 18: నటి శిల్పాశెట్టికి చెందిన 98 కోట్ల విలువైన ఆస్తుల ఈడీ అటాచ్
ఏప్రిల్ 21: తిరుమలలో కల్పనా రావుతో నటుడు తిరువీర్ వివాహం