సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన సతీమణి సైరా బానుతో వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెహమాన్.. సంగీతానికి కూడా కొంతకాలం దూరంగా ఉండనున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో, రెహమాన్ మ్యూజిక్ ని మిస్ అవ్వాల్సిందేనా ? అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. కాగా ఈ కామెంట్స్ పై రెహమాన్ కుమార్తె ఖతీజా స్పందించారు.
ఖతీజా పోస్ట్ పెడుతూ.. అందులో నిజం లేదని చెప్పినా రూమార్స్ వస్తూనే ఉన్నాయి. ‘దయచేసి అసత్య ప్రచారాన్ని ఆపండి’ అని ఆమె రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం రెహమాన్ సంగీతం అందిస్తున్న తెలుగు సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమాకి రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
The post ఆ ప్రచారం పై రెహమాన్ కుమార్తె క్లారిటీ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.