Published on Nov 24, 2024 5:30 PM IST


సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తన సతీమణి సైరా బానుతో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెహమాన్‌ను తప్పుబడుతూ కొందరు నెటిజన్లు బ్యాడ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై సైరా బాను స్పందిస్తూ తన భర్త రెహమాన్ ఎంతో గొప్ప వ్యక్తి అని ఆమె చెప్పుకొచ్చింది. సైరా బాను ఇంకా మాట్లాడుతూ..‘ప్రస్తుతం నేను ముంబయిలో ఉన్నాను. గత కొన్ని నెలలుగా నా ఆరోగ్యం బాలేదు. ఆ కారణంతోనే ఆయనకు దూరంగా ఉండాలనుకున్నాను’ అని ఆమె తెలిపింది.

సైరా బాను ఇంకా మాట్లాడుతూ.. ‘యూట్యూబ్‌, తమిళ మీడియాను ఒక్కటే కోరుకుంటున్నాను. దయచేసి రెహమాన్ గురించి ఎలాంటి చెడు ప్రచారం చేయవద్దు. ఆయన చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి. ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన అంటే నాకెంతో ఇష్టం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం. దయచేసి ఆయనపై విమర్శలు చేయడం ఇకనైనా మానండి’ అని రెహమాన్ తెలిపింది. మొత్తానికి 29 ఏళ్ల వైవాహిక బంధానికి ఈ జంట స్వస్తి పలుకుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *