
సినీ పరిశ్రమలో ప్రేమ, పెళ్లి, విడాకులు సాధారణం అయిపోయాయి. కొందరు నటీనటులు సంవత్సరాల తరబడి కలిసున్నా, అనూహ్యంగా విడాకులు ప్రకటించి షాక్ ఇస్తున్నారు. ఇక కొంతమంది వయస్సు పెరిగిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. అలా 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి. ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? వధువు ఎవరు? ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్.
ఆశిష్ విద్యార్థి భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అనేక విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా “పోకిరి” సినిమాలో విలన్గా ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. గతంలో ఎక్కువగా ప్రతినాయక పాత్రలు చేసిన ఈ యాక్టర్, ప్రస్తుతం ఫాదర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఆశిష్ విద్యార్థి 2023లో అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి కోల్కతాలోని క్లబ్లో ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “ప్రేమకు వయస్సు అడ్డం కాదు, జీవితం ఒక్కటే, దాన్ని ఆనందంగా గడపాలి” అని తెలిపారు. 60 ఏళ్ల వయసులో జరిగిన ఈ వివాహం నార్త్ మరియు సౌత్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
ప్రస్తుతం ఆశిష్ విద్యార్థి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ట్రావెలింగ్ ఎక్స్పీరియెన్స్ మరియు ఫుడ్ రివ్యూలను షేర్ చేస్తున్నారు. తన భార్యతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన లైఫ్లో వచ్చిన ఈ కొత్త మలుపు గురించి నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే ఆశిష్ విద్యార్థి తన కొత్త జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు.