Published on Dec 5, 2024 11:14 PM IST
పుష్ప-2… ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వినబడుతున్న ఒకే ఒక్క పేరు. రికార్డులు తొక్కుకుంటూ వెళ్లేందుకు పుష్పరాజ్ సిద్ధమయ్యాడు. ఇప్పటికే తొలిరోజు సాలిడ్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ ర్యాంపేజ్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమా తొలి రోజు టోటల్ వసూళ్లు వచ్చేసరికి ఎన్ని రికార్డులు మాయం అవుతాయో చూడాలి.
ఇలాంటి వండర్‌ని తన భుజాలపై వేసుకుని బాక్సాఫీస్ దగ్గర తాండవం చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని ప్రేక్షకులు, అభిమానులు, సినీ సెలెబ్రిటీలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, భరత్ నారంగ్ అల్లు అర్జున్‌ను కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి గ్రాండ్ మాస్ ఫీట్‌తో థియేటర్లలో జాతర వాతావరణం తీసుకొచ్చినందుకు ఆయనకు తమ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.