‘పుష్ప 2’ సూపర్ హిట్ విజయంతో అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టులను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయిన స్టైలిష్ స్టార్, మరో భారీ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు. షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ బ్లాక్ బస్టర్ అందించిన తమిళ దర్శకుడు అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అట్లీ, బన్నీ – భారీ సినిమా సెటప్ లో!

ఇటీవల వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా అట్లీ దర్శకత్వం వహించిన ‘బేబీ’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే, ఆయన ఇప్పుడే బాలీవుడ్ ను వదిలేయడం లేదు. సల్మాన్ ఖాన్ తో చేయాల్సిన ప్రాజెక్ట్‌ను వాయిదా వేసి, ముందు అల్లు అర్జున్ తో సినిమాను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇది పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కే సినిమా కావడంతో, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

త్రివిక్రమ్, భన్సాలీ, అట్లీ – బన్నీ వరుస ప్రాజెక్ట్స్!

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న అల్లు అర్జున్, ఆ తర్వాత బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాతో బిజీ కానున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయ్యాకే అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ‘బిగిల్’ (2019) తర్వాత అట్లీ ఏ సౌత్ సినిమా చేయలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ తో ఈ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ద్వారా సౌత్‌లో మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు.

సంగీత దర్శకుడు సాయి అభయంక

ఈ ప్రాజెక్ట్‌కు యువ సంగీత దర్శకుడు సాయి అభయంక సంగీతం అందించనున్నట్లు టాక్. ఆయన ప్రముఖ గాయకుడు టిప్పు కుమారుడు అని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చేవరకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 తర్వాత బన్నీ కొత్త రికార్డులు సృష్టించనున్నాడా? అనేది చూడాలి.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *