
అతుల్య రవి ఒక టాలెంటెడ్ ఇండియన్ హీరోయిన్, ప్రధానంగా తమిళం, తెలుగు సినీ ఇండస్ట్రీలో పని చేస్తుంది. 1994 డిసెంబర్ 21 న తమిళనాడు కోయంబత్తూరు లో జన్మించిన ఈమె అసలు పేరు దివ్య. ఆమె తన స్కూల్ విద్యను Vivekam Matriculation Higher Secondary School లో పూర్తిచేసి, కర్పగం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివింది. అంతేకాక, SRM Institute of Science and Technology, శ్రీ కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో కూడా చదువుకుంది.
అతుల్య తన నటనా ప్రస్థానాన్ని “పల్వాది కాదల్” అనే తమిళ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రారంభించింది. 2017లో ఆమె “కాదల్ కన్ కట్టుదే” అనే రొమాంటిక్ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో V.Z. దురై దర్శకత్వం వహించిన “యేమాలి” అనే చిత్రంలో నటించింది.
తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతుల్య 2023లో “మీటర్” మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంతో జతకట్టింది. ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ అతుల్య టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె “Chennai City Gangsters”, “Diesel” వంటి సినిమాల్లో నటిస్తుంది.
అతుల్య రవి తన క్యూట్ లుక్స్, నటనా నైపుణ్యం ద్వారా సినీ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆమె భవిష్యత్తు ప్రాజెక్ట్స్‌పై అందరి దృష్టి ఉంది. త్వరలో మరిన్ని హిట్ సినిమాలతో తెలుగు, తమిళ పరిశ్రమల్లో తన స్థానాన్ని స్థిరపరుచుకోవాలని ఆశిస్తున్నారు.