August 2024 Movie Roundup: హేమ కమిటీ బాంబ్.. నాగచైతన్య నిశ్చితార్థం

ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు నెల విషయానికి వస్తే

ఆగస్టు 8: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళ వివాహ నిశ్చితార్థం

ఆగస్టు 14: జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే చెయ్యి బెణికింది, రెండు వారాల విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగ్ లో
పాల్గొంటానని ఎన్టీఆర్ వివరణ

ఆగస్టు 16: ఉత్తమ జాతీయ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ -2’

ఆగస్టు 22: సినిమా షూటింగ్ సమయంలో రవితేజ భుజానికి గాయం

ఆగస్టు 22: ‘రాజావారు – రాణిగారు’ హీరోహీరోయిన్లు కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్ వివాహం

ఆగస్టు 22: స్నేహితుడు సాయి విష్ణుతో నటి మేఘా ఆకాశ్‌ వివాహ నిశ్చితార్థం

ఆగస్టు 22: గద్దర్ అవార్డుల విధి విధానాలపై తెలంగాణ ప్రభుత్వం ‘దాసి’ నరసింగరావు ఛైర్మన్ గా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి
దిల్ రాజు ఉపాధ్యక్షుడు. తమ్మారెడ్డి భరద్వాజ, కె. రాఘవేంద్రరావు, సురేశ్‌ బాబు, హరీశ్‌ శంకర్, అల్లాణి శ్రీధర్, ‘బలగం’ వేణు తదితరులు సలహా మండలి సభ్యులు

ఆగస్టు 23: నటి హేమపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తేసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్

ఆగస్టు 23: నటుడు ప్రభాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అర్షద్ వార్వీ చర్యలను ఖండిస్తూ ముంబై టీవీ, సినీ నటీనటుల సంఘం
అధ్యక్షురాలు పూనమ్ థిల్లాన్ కు ‘మా’ లేఖ రాసింది.

ఆగస్టు 25: హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్ లిక్ తో ఇటలీలో నటి అమీ జాక్సన్ వివాహం

ఆగస్టు 25: హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తో మల్లూవుడ్ లో కలకలం ‘అమ్మ’ కార్యదర్శి సిద్ధిఖీ, కేరళ చలనచిత్ర మండలి అధ్యక్షుడు, దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ తమ పదవులకు రాజీనామా

ఆగస్టు 25: తెలుగు ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికల్లో అమ్మిరాజు కానుమిల్లి విజయం

ఆగస్టు 27: హేమ కమిటీ రిపోర్ట్ వివాదం కారణంగా ‘అమ్మ’ అసోసియేషన్ అధ్యక్షపదవికి మోహన్ లాల్ రాజీనామా

ఆగస్టు 28: ప్రమీలతో ‘టైగర్ నాగేశ్వరరావు’ దర్శకుడు వంశీకృష్ణ వివాహం జరిగింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *