హీరోయిన్ అవికా గోర్ బాలనటిగా బుల్లితెరపై సందడి చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అవికా గోర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే, తనకు ఎదురైన కొన్ని చేదు సంఘటనల గురించి అవికా గోర్ ఇంకా చెప్పుకొచ్చింది. తనను కాపాడతాడని ఓ బాడీగార్డుకి ఉద్యోగం ఇస్తే.. ఆ వ్యక్తే.. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఎమోషనల్ అవుతూ అవికా గోర్ చెప్పింది. ఈ సందర్భంగా తన జర్నీ గురించి కూడా ఆమె చెబుతూ.. తాను పెద్దయ్యాక ఎన్నో హింసలు, సవాళ్లు ఎదుర్కొన్నానని ఆమె తెలిపింది.
ఈ క్రమంలోనే తనను రక్షించాల్సిన బాడీగార్డు తనతో అనుచితంగా ప్రవర్తించి, తనను బాధించాడని అవికా వెల్లడించింది. అవికా గోర్ ఈ విషయం గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘ఓ ఈవెంట్లో నా బాడీగార్డు నన్ను దారుణంగా తాకాడు. అతను నాతో అసభ్యంగా ప్రవర్తించగానే.. నేను అతడి వైపు సీరియస్ గా చూసి ఏంటీ అని అడగ్గా.. వెంటనే అతను నాకు సారీ చెప్పాడు. దీంతో, ఆ సంఘటనను నేను వదిలేశాను. కానీ, ఆ తర్వాత కూడా అతను అలాగే ప్రవర్తించాడు. అలా ప్రవర్తించినప్పుడు అతడిని కొట్టే ధైర్యం ఉంటే.. ఈపాటికి నేను చాలా మందిని కొట్టేదాన్ని. కానీ, ఇప్పుడు నాకు ఆ ధైర్యం ఉంది అని అవికా గోర్ చెప్పుకొచ్చింది.
The post కాపాడాల్సిన వాడే అసభ్యంగా ప్రవర్తించాడు – అవికా గోర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.