ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో చేసిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “పుష్ప 2” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు అందుకొని అదరగొట్టింది. అయితే అయితే ఈ సినిమాలో హైలైట్ అయ్యిన ఎన్నో అంశాల్లో సినిమా రిలీజ్ అయ్యాక ప్రతీ ఒక్కరూ మాట్లాడుకున్న వాటిలో ఓ క్రేజీ మాస్ సాంగ్ కూడా ఒకటి అని చెప్పాలి.
సాంగ్ అంటే సాంగ్ కాదు కానీ సాంగ్ లాంటి దానితో అల్లు అర్జున్ తో సుకుమార్ పాడించిన సాంగ్ అని చెప్పాలి. ఫహద్ ఫాజిల్ పోషించిన సాలిడ్ రోల్ భన్వర్ సింగ్ షెకావత్ కి ఛాలెంజ్ విసురుతూ దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అంటూ ఉంటుంది.
మరి ఇది సినిమా చూసిన వెంటనే ఇన్స్టంట్ గా అందరికీ క్లిక్ అయ్యిపోయింది. ఇక అక్కడ నుంచే ఈ సాంగ్ ని వదలాలి అని అభిమానులు కోరగా ఇపుడు ఫైనల్ గా ఈ ట్రాక్ ని మేకర్స్ పాన్ ఇండియా భాషల్లో అఫీషియల్ గా రిలీజ్ చేశారు. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
The post “పుష్ప 2” నుంచి అవైటెడ్ మాస్ ట్రాక్ వచ్చేసింది.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.