ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన అన్ని పాటలు కూడా భారీ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని పాటలు ఒకెత్తు అయితే పీలింగ్స్ అనే సాంగ్ ఇంకో ఎత్తు అని చెప్పాలి.
ఈ సాంగ్ రిలీజ్ కాకుండా చిన్న బిట్ వచ్చినపుడే సాలిడ్ బజ్ నమోదు అయ్యిపోయింది. మరి ఎట్టకేలకి ఈ సాంగ్ ని మేకర్స్ విడుదల చేసేసారు. మరి ఈ సాంగ్ అంచనాలకి తగ్గట్టుగానే మాస్ బీట్స్ తో అదిరిపోయింది అని చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ బీట్స్ అండ్ వోకల్స్ తో అప్పుడు సామి తర్వాత మళ్ళీ మరో చార్ట్ బస్టర్ డ్యూయెట్ ని అందించాడు అని చెప్పడంలో డౌట్ లేదు.
అయితే ఈ సాంగ్ కొంచెం స్పెషల్ అని చెప్పాలి. గతంలో వచ్చిన సాంగ్స్ లో డాన్స్ బిట్ చాలా తక్కువే ఉంది కానీ.. ఈ ఒక్క సాంగ్ లో మాత్రం అల్లు అర్జున్, రష్మికపై దాదాపు వీడియో విజువల్స్ వారి డాన్స్ మూమెంట్స్ ని మేకర్స్ చూపించేసారు. దీనితో ఇది వాటికి మించి స్పెషల్ గా మారింది అని చెప్పాలి. ఇక ఈ సాంగ్ లో అల్లు అర్జున్, రష్మిక మందన్నల ఎనర్జీ అయితే ఇంకో లెవెల్లో ఉందని చెప్పాలి. మొత్తానికి అయితే థియేటర్స్ లో మాస్ ఫీస్ట్ ఉండబోతుంది అని ఈ సాంగ్ తో ఉండబోతుంది అని చెప్పాల్సిందే.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
The post మాస్ బీట్స్ తో అదిరిపోయిన ‘పీలింగ్స్’ సాంగ్.. కానీ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.