Published on Dec 29, 2024 9:00 PM IST
వరల్డ్ వైడ్ గా మంచి పాపులార్టీ ఉన్న ప్రముఖ ఓటిటిలలో దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. మరి నెట్ ఫ్లిక్స్ లో ఎన్నో సెన్సేషనల్ అండ్ గ్లోబల్ హిట్ సిరీస్ లు ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఎన్నో సీక్వెల్ సీజన్స్ కూడా ఉన్నాయి. అయితే వాటిలో రీసెంట్ గా మంచి అంచనాలు నడుం ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న సీక్వెల్ ని తీసుకొచ్చారు.
అదే “స్క్విడ్ గేమ్ సీజన్ 2”. మొదటి సీజన్ నెట్ ఫ్లిక్స్ లో ఉన్న రికార్డులు అన్నీ ఒక్క రోజులోనే తిరగరాసింది. దీనితో సీజన్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎట్టకేలకు చాలా ఏళ్ల తర్వాత ఆడియెన్స్ ని ఊరిస్తూ ఈ సీజన్ నేటి ఫ్లిక్స్ లో మొన్న డిసెంబర్ 26న వచ్చింది. అయితే ఈ సీజన్ 2 మాత్రం అనుకున్న అంచనాలు అందుకోలేదని చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సీజన్ 1 ఎంత ఎంగేజింగ్ గా మంచి డ్రామాతో సాగిందో ఇపుడు సీజన్ 2 కి మాత్రం మేకర్స్ పర్ఫెక్ట్ ఎండింగ్ ఇవ్వలేకపోయాఋ. దీనితో ఇపుడు చాలా నెగిటివ్ కామెంట్స్ ఈ సీజన్ పై వినిపిస్తున్నాయి. దీనితో ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సీజన్ మాత్రం ఓటిటి ఆడియెన్స్ ని డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి.