ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా మళ్లీ ఓ రేంజ్ లో వినిపిస్తున్న క్రేజీ వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా కొరియన్ హిట్ సిరీస్ “స్క్విడ్ గేమ్” అనే చెప్పాలి. గత కొన్నేళ్ల కితం వచ్చిన సీజన్ 1 బిగ్ హిట్ అయ్యింది. దీనితో సీజన్ 2 పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలా భారీ హైప్ నడుమ రీసెంట్ గానే వచ్చిన ఈ సీజన్ కూడా రికార్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
అయితే సీజన్ 2ని అర్ధాంతరంగా ఆపేయడం చాలా మందికి నచ్చలేదు దీనితో సీజన్ 3 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సీజన్ బి నెట్ ఫ్లిక్స్ వారు ఈ 2025 లోనే తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు కానీ డేట్ ని ఇవ్వలేదు. కానీ ఇపుడు ఈ డేట్ లీక్ అయ్యినట్టు తెలుస్తోంది. దీనితో ఈ ఏడాది జూన్ 27 నుంచి స్క్విడ్ గేమ్ 3 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. మరి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
The post “స్క్విడ్ గేమ్ 3” రిలీజ్ డేట్ లీక్!? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.