‘బాహుబలి: ది ఎపిక్’ పై ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లెజెండరీ సినిమా ఇప్పుడు కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలను కలిపి, పూర్తిగా రీ-కట్ చేసి, రీ-మాస్టర్ చేసిన ఈ స్పెషల్ వెర్షన్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే బాహుబలి టీమ్ కొత్త అనుభూతిని ఇవ్వడానికి అహర్నిశలు శ్రమిస్తోంది. తాజాగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ఆయన ప్రకారం, బాహుబలి: ది ఎపిక్ కోసం కలర్ గ్రేడింగ్ పనులు పూర్తయ్యాయి, విజువల్స్ మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉండబోతున్నాయట.
Additionally Learn : Ravi Teja : రవితేజ బయోపిక్ ప్లాన్ చేసిన హీరో ఎవరో తెలుసా?
ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ భారతీయ సినిమాకు కొత్త గౌరవాన్ని తీసుకొచ్చింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. కొత్త వెర్షన్‌లో సౌండ్, విజువల్స్, ఎఫెక్ట్స్ అన్నీ మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. బాహుబలి సిరీస్ మళ్లీ థియేటర్లలోకి రావడం ప్రేక్షకుల్లో నాస్టాల్జియా రేపుతోంది. ఈ రీ-మాస్టర్ వెర్షన్ ఎంత కొత్త అనుభూతిని అందిస్తుందో, మళ్లీ ఏ రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.