గతేడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమాలలో ‘బేబీ’ ఒకటి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గోవర్ధన మారుతీ, ఎస్‍కేఎన్ నిర్మించారు.రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆనంద్ దేవాకొండ, వైష్ణవి కాంబోకు ప్రశంసలతో పాటు అవార్డ్స్ కూడా దక్కాయి.
కాగా ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ జోడి రిపీట్ కానుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా మరో సినిమా పట్టాలెక్కనుంది. ఈటీవీ విన్ లో రిలీజ్ అయి సెన్సేషన్ హిట్ గా నిలిచిన #90 వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నాగవంశీ నిర్మించనున్నారు. త్వరలోనే అధికారకంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించనున్నారు. కాగా ఈ సినిమాకు ‘ఓ రెండు మేఘాలిలా’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట మేకర్స్. వెబ్ సిరీస్ ద్వారా ఆకట్టుకున్నం ఆదిత్య హాసన్ తోలి సారి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. బేబీ వంటి సూపర్ హిట్ కాంబోతో ఆదిత్య హాసన్ ఎంతటి హిట్ కొడతాడో చూడాలి .