• వరుణ్‌ ధావన్‌పై విమర్శలు
  • కియారాతో తప్పుగా ప్రవర్తించలేదు
  • అలియా నాకు మంచి ఫ్రెండ్

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌పై గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్‌లో స్టార్ హీరోయిన్ అలియా భట్‌ ప్రైవేట్‌ పార్ట్స్‌ పట్టుకోవడంతో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఓ సినిమా షూటింగ్‌లో మరో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని అందరి ముందే ముద్దు పెట్టుకోవడంతో వరుణ్‌ ధావన్‌ను నెటిజెన్స్ ఏకిపారేశారు. కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తనపై వస్తోన్న ఆరోపణలపై తాజాగా ఆయన స్పందిస్తూ.. అలియా, కియారాలతో తప్పుగా ప్రవర్తించలేదన్నారు.

శుభంకర్ మిశ్రా పోడ్‌కాస్ట్‌లో వరుణ్ ధావన్‌ మాట్లాడుతూ… ‘నేను సినిమా షూటింగ్‌ సమయంలో నా సహచర నటీనటులందరితో ఒకేలా ఉంటాను. నా సహచర నటీనటులతో ఎన్నోసార్లు సరదాగా ప్రవర్తించాను. అయితే ఆ విషయం గురించి ఎవరూ ప్రస్తావించలేదు. ఇప్పుడు నాపై వస్తున్న విమర్శలపై ప్రశ్న అడిగినందుకు సంతోషంగా ఉంది. ఈ విషయంలో క్లారిటీ ఇస్తాను. నేను అందరి ముందు కియారాను కావాలనే ముద్దు పెట్టుకోలేదు. ఒక మ్యాగజైన్‌ ఫొటో షూట్‌ కోసం అలా చేశాం. ఆ క్లిప్‌ను నాతో సహా కియారా కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. అలియా నాకు మంచి ఫ్రెండ్. ఆరోజు సరదాగా అలా చేశాను. అది సరసం మాత్రం కాదు. మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులమే’ అని చెప్పుకొచ్చాడు.

వరుణ్‌ ధావన్‌ నటించిన ‘బేబీ జాన్‌’ సినిమా క్రిస్మస్‌ కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాలీస్‌ దర్శకత్వం వచించిన ఈ సినిమాకు.. ప్రముఖ దర్శకుడు అట్లీ కథను అందించారు. ఈ సినిమాతో దక్షిణాది భామ కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్‌, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషించగా.. సల్మాన్‌ ఖాన్‌ అతిథి పాత్రలో నటించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *