సెన్సార్ పూర్తి చేసుకున్న ‘బఘీర’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 27, 2024 1:30 AM IST

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన లేటెస్ట్ మూవీ ‘బఘీర’ దీపావళి కానుకగా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో కన్నడ హీరో శ్రీమురళి నటిస్తున్నాడు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక తెలుగులోనూ ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

దీపావళి బరిలో మంచి క్రేజ్‌తో రిలీజ్‌కు రెడీ అయిన ‘బఘీర’ చిత్రం తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సినిమాను దర్శకుడు డా.సూరి డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ రుక్మిణి వాసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *