Bagheera Movie Review in Telugu, Srii Murali, Rukmini Vasanth

విడుదల తేదీ : అక్టోబర్ 31, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : శ్రీ మురళి, రుక్మిణి వసంత్, అచ్యుత్, గరుడ రామ్, ప్రకాష్ రాజ్ తదితరులు

దర్శకుడు : డాక్టర్ సూరి

నిర్మాతలు : హోంబళే ఫిలిమ్స్

సంగీత దర్శకుడు : ఆజనీస్ లోకనాథ్

సినిమాటోగ్రఫీ : అర్జున్ శెట్టి

కూర్పు : ప్రణవ్ శ్రీ ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ దీపావళి బ్లాస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో స్ట్రైట్ తెలుగు సినిమాలు సహా డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో కన్నడ రోరింగ్ స్టార్ శ్రీ మురళి నటించిన భారీ సినిమా “బఘీర” కూడా ఒకటి. మరి ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని అలరించిందో లేదో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ఇక కథ లోకి వస్తే.. వేదాంత్ ప్రభాకర్(శ్రీ మురళి) తన చిన్ననాటి నుంచే ప్రజలని కాపాడే ఒక సూపర్ హీరో కావాలి అని కోరుకుంటాడు. కానీ తన తల్లి మాటలతో ఒక పవర్ఫుల్ పోలీస్ గా మారుతాడు. అలా మంగళూరులో ఉన్న క్రైమ్ ని దాదాపు మట్టుపెడతాడు. ఇలా ఒక సిన్సియర్ ఆఫీసర్ గా ఉన్న తన లైఫ్ లో జరిగిన ఎమోషనల్ టర్నింగ్ ఏంటి? ఎంతో నిజాయితీగా ఉండే తాను ఎందుకు కరప్ట్ అవుతాడు? తాను ఎలా ‘బఘీర’ గా మారాల్సి వస్తుంది. అలా మారి ఏం చేస్తాడు? ఇంకో పక్క మనుషుల అవయవాలతో ట్రేడింగ్ చేసే అత్యంత క్రూరుడు రానా(గరుడ రామ్) ని ఎలా అడ్డుకుంటాడు అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో మాస్ ఆడియెన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. కన్నడ సినిమాకి చెందిన మేకర్స్ కథ ఎలా ఉన్నా కూడా మాస్ ఎలిమెంట్స్ ని చూపించడంలో మాత్రం ముందుంటున్నారు. అదే విధంగా ఈ సినిమాలో కూడా సాలిడ్ మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ మాస్ ఆడియెన్స్ కి ఎంగేజ్ చేస్తాయి.

మెయిన్ గా శ్రీమురళి పోలీస్ లుక్ లో కనిపించిన సీన్స్ అన్నీ బాగున్నాయి. అలాగే శ్రీ మురళి తన రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్టయ్యారు అని చెప్పొచ్చు. తన మ్యాచో పర్సనాలిటీ పోలీస్ గెటప్ కి అలాగే బఘీర కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. అలాగే తన నటన మెయిన్ గా సినిమాలో తన యాక్షన్, స్టంట్స్ చాలా బాగున్నాయి. ఇక వీటితో పాటుగా కొన్ని చోట్ల ఎమోషన్స్ పర్వాలేదు.

ఇక వీటితో పాటుగా నటి రుక్మిణి వసంత్ రోల్ బాగుంది. తన రోల్ లో ఆమె నీట్ గా చేసింది. ఇంకా నటుడు అచ్యుత్ కుమార్, అలాగే వెర్సటైల్ నటుడు ప్రకాష్ రాజ్ లు తమ వెర్సటాల్టీ చూపించి తమ రోల్స్ బాగా చేశారు. అలాగే విలన్ గా చేసిన గరుడ రామ్ అయితే క్రేజీ విలనిజాన్ని చూపించాడు అని చెప్పాలి. తన ఇంట్రో సీన్ నే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే తన విలనిజాన్ని చూపించిన విధానం, తనపై కొన్ని ఫైట్ సీన్స్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రానికి సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కథని అందించారు. నీల్ శ్రీమురళితోనే తన డెబ్యూ ‘ఉగ్రం’ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ తన హీరో కోసం ఇచ్చిన కథ మాత్రం మరీ అంత కొత్త కథేమీ కాదని చెప్పాలి. చిన్నప్పుడు నుంచే సూపర్ హీరో కావాలి అనుకునే పిల్లాడు పోలీస్ బ్యాక్ డ్రాప్, ఒక పెద్ద విలన్ దగ్గరకి వెళ్ళడానికి మధ్యలో ఓవర్ బిల్డప్ చూపించే చిన్నా చితకా విలన్స్ ని ఆల్రెడీ చూసేసాము.

మరి బఘీరలో కూడా ఏవ్ రొటీన్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. దీనితో కేవలం కొన్ని మూమెంట్స్ తప్ప సినిమాలో ఎగ్జైట్ చేసే కొత్త ఎలిమెంట్ ఏమి ఉండదు. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ అయితే ఓవర్ డ్రమాటిక్ గా కనిపిస్తాయి. ఊరికే హైప్ ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే ఇంకా పాత కాలం లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే సినిమా లెంగ్త్ మరీ పెద్దది కాకపోయినప్పటికీ సినిమా చూస్తున్నంత సేపు కొంచెం సాగదీతగా అనిపించక మానదు. ఇది సినిమా ఫస్టాఫ్ సెకండాఫ్ రెండిట్లో కూడా ఇదే స్క్రీన్ ప్లే కనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం:

ఈ చిత్రానికి మేకర్స్ పెట్టిన నిర్మాణ విలువలు బాగున్నాయి. గ్రాండ్ ఎలిమెంట్స్ తో ఒక సెమీ సూపర్ హీరో సినిమా తరహాలో ట్రై చేశారు. అందుకు తగ్గట్టుగా చేసిన ఆర్ట్ వర్క్ కూడా బాగానే ఉంది. అజనీష్ ఇచ్చిన స్కోర్ అయితే కొన్ని సీన్స్ ని మంచి స్టైలిష్ గా ఎలివేట్ చేసింది. మిగతా సీన్స్, కొన్ని సాంగ్స్ పర్వాలేదు. ట్రైలర్ లో డార్క్ థీమ్ లో కనిపించిన ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై పర్వాలేదు బాగానే ఉంది. ఎడిటింగ్ కూడా ఓకే. తెలుగు డబ్బింగ్ బాగుంది.

ఇక దర్శకుడు సూరి విషయానికి వస్తే.. తాను ఈ సినిమాకి డీసెంట్ వర్క్ అందించారు అని చెప్పొచ్చు. కథలో పెద్దగా బలం లేదు కానీ కొన్ని సీన్స్ హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేసుకున్న విధానం బాగుంది. అలాగే కొన్ని సీన్స్ రొటీన్ గానే ఉన్నా రెగ్యులర్ మాస్ ఆడియెన్స్ కి కావాల్సిన స్క్రీన్ ప్లే తో అయితే సినిమాని నడిపించేసారు.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే సామాన్య జనం నుంచే పుట్టుకొచ్చిన ఈ కొత్త సూపర్ హీరో కానీ సూపర్ హీరో “బఘీర” కొన్ని చోట్ల వరకు ఓకే అనిపిస్తాడు. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ ని అయితే మెప్పించవచ్చు. మంచి ఎలివేషన్స్ వంటివి కోరుకునేవారికి కూడా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. కానీ సినిమాలో కథలో కొత్తదనం ఏమీ లేదు అలాగే అక్కడక్కడా సినిమా కొంచెం సాగదీతగానే అనిపిస్తుంది. వీటితో అయితే ఈ బఘీర మాస్ ఆడియెన్స్ వరకు ఓకే అనిపిస్తాడు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *