ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమా బాహుబలి. ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు ఘన విజయాలు సాధించాయి. హీరో ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళికి వరల్డ్ వైడ్ ఫేమ్ తీసుకొచ్చాయి. ఇప్పుడీ ప్రాంఛైజీలో మూడో పార్ట్ కూడా అనౌన్స్ చేశాడు రాజమౌళి. అయితే ఇది సినిమా కాకుండా యానిమేషన్ సిరీస్ గా ఉండబోతోంది. ట్విట్టర్ ద్వారా బాహుబలి మూడో భాగానికి బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే టైటిల్ ప్రకటించారు రాజమౌళి.

త్వరలోనే ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. బాహుబలి మాహిశ్మతి రాజ్యానికి తిరిగి రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటే విశ్వంలో ఏ శక్తీ అతన్ని ఆపలేదు. బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ త్వరలో రిలీజ్ చేస్తున్నాం అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. బాహుబలి 3 సినిమాగా వస్తే మరో సిల్వర్ స్క్రీన్ వండర్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.