అనుకున్నట్టే అంచనాలకు మించి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర తిరగరాసేలా ఉన్నాడు పుష్పరాజు. ఫస్ట్ డే రూ. 294 కోట్లతో ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన పుష్ప 2. ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు, రెండు వారాల్లో రూ. 1500 కోట్లు రాబట్టి అత్యధిక వేగంగా ఈ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు 21 రోజుల్లో అంటే మూడు వారాల్లోనే రూ. 1705 కోట్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ లెక్కన మరో రూ. 100 కోట్లు రాబడితే చాలు బాహుబలి – 2 రికార్డ్ ఎగిరిపోయినట్టే. ఇప్పటివరకు బాహుబలి -2 దరిదాపుల్లోకి కూడా ఏ సినిమా వెళ్లలేదు. కానీ పుష్ప2 మాత్రం ఏకంగా బాహుబలి రికార్డ్‌కే ఎసరు పెట్టింది. బాహుబలి – 2 లైఫ్ టైం కలెక్షన్స్ రూ. 1800 కోట్లతో ఇండియన్ టాప్ గ్రాసర్ మూవీస్‌లో రెండో స్థానంలో ఉంది. కానీ కేవలం 21 రోజుల్లోనే రూ. 1705 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇందులో రూ. 700 కోట్లు నార్త్ బెల్ట్ నుంచే ఉండడం మరో సంచలనం. ఇంకొక్క వంద కోట్లు రాబడితే చాలు బాహుబలి – 2 రికార్డ్ బ్రేక్ అయిపోనుంది. అలాగే మరో 200 కోట్లు రాబడితే ‘దంగల్’ రికార్డ్ బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు పుష్పరాజ్. ‘దంగల్’ మూవీ రూ. 2 వేల కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా ఈ కలెక్షన్స్‌ను ఇప్పట్లో ఎవరు అందుకోలేరని అంతా భావించారు. కానీ క్రిస్మస్ హాలీడేస్, సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవి థియేటర్లో లేకపోవడం పుష్ప- 2కి టాప్ ప్లేస్‌కి వెళ్లే ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాయి.