
సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘బజరంగీ భాయిజాన్’లో నటించిన మున్నీ గుర్తుందా? అదే చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్రా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. 2015లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయం సాధించింది. అందులో అమాయకమైన మున్నీ పాత్రలో కనిపించిన హర్షాలి ఇప్పుడే కాదు, అప్పట్లో కూడా తన భావోద్వేగ నటనతో ప్రేక్షకులను అలరించింది.
అప్పుడు వయసు 7 సంవత్సరాలు మాత్రమే ఉన్న హర్షాలి ప్రస్తుతం 16 ఏళ్ల కుర్రతిగా మారింది. గ్లామరస్ ఫోటోషూట్లతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ బ్యూటీకి Instagramలో 3.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవలి పదవ తరగతి పరీక్షల్లో 83% మార్కులు సాధించి చదువులోనూ తనదైన ముద్ర వేశింది. అదే సమయంలో కథక్ డాన్స్‌లో శిక్షణ తీసుకుంటోంది, performing arts పట్ల ఉన్న ఆసక్తిని చూపిస్తోంది.
బజరంగీ భాయిజాన్ తర్వాత హర్షాలి ‘కుబూల్ హై’, ‘లౌత్ ఆవో త్రిష’, ‘సావధాన్ ఇండియా’ వంటి ప్రాజెక్ట్స్‌లో కనిపించింది. కానీ చదువులపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుని, మధ్యలో వచ్చిన అనేక సినిమాలను తిరస్కరించింది. ఇప్పుడు మాత్రం స్టన్నింగ్ ఫోటోషూట్లతో మళ్లీ ఫిలిం న్యూస్‌లోకి వచ్చింది.
ఈ చిన్నారి మళ్లీ సినిమాల్లోకి ఎంటర్ అవుతుందా? లేక Influencerగా కొనసాగుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. ఆమె తాజా ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తుండగా, అభిమానులు “మున్నీ ఇంతగా మారిపోయిందా!” అని షాక్ అవుతున్నారు.